Description
ఇంకా ఒక అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రయాణాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం Trekloom ఛానల్ ద్వారా! ఈసారి గమ్యం!? — చరిత్ర, ధైర్యం, దృఢనిశ్చయానికి నిలువెత్తు ఉదాహరణ అయిన సింహగఢ్ కోట!! ఉదయం తెల్లవారుఝామునే బైక్ స్టార్ట్ చేసి, సన్నద్ధంగా బయలుదేరాను. బయట గాలిలో ఓ కొత్త ఉత్సాహం ఉంది!? ఇంతలో గుర్తొచ్చింది – మహేష్‌ను పికప్ చేయాలి కదా!? లేకపోతే ఈ ప్రయాణానికి కొంచెం కిక్ తక్కువవుతుంది! మహేష్‌ను తీసుకున్న తర్వాత, ఇద్దరం కలిసి పుణె నుండి డోంజే ఫాటా దాకా ప్రయాణం మొదలెట్టాం. బైక్ మీద గాలి తాకుతూ, మార్గమధ్య పచ్చని పొలాలు చూసుకుంటూ – ఓహ్! ఎలా చెప్పాలి!? అసలైన బైకింగ్ ఫీలింగ్ వచ్చేసింది! అక్కడినుంచి అట్కర్వాడి బేస్ విలేజ్ కి ఇంకో 10 నిమిషాల రైడ్. కెమెరా ఓన్ చేశాం, మూడ్ సెటప్ అయ్యింది!? బైక్ పార్క్ చేశాం. కానీ వెంటనే ఏమి గుర్తొచ్చిందంటే – “ఓహ్ నో! ఎనర్జీ లేదు!? తిన్నాకే ట్రెక్కింగ్!!” చుట్టూ చూస్తూ ఒక చిన్న హోటల్ కనబడింది. అక్కడికి వెళ్లగానే మహేష్ ఒక కుక్కతో ఆడుతూ పిచ్చిపనులు చేస్తున్నాడు!? 😂 ఆ క్యూట్ మూమెంట్స్ కెమెరాలో వేసుకున్నాం. అప్పుడే ఇద్దరం వేడి వేడి పోహా ఆర్డర్ చేసుకున్నాం… అసలు అదే మనకు ఎనర్జీ సప్లై!! వాల్-సే ఫుడ్! బయలుదేరిన తర్వాత ఒక మంచి రూట్ కనిపించింది – క్లియర్, సాఫీగా ఉంది… కానీ!? మన మనసు అదేనా!? మేము ఎప్పుడూ rugged, raw, real trail కోసం వెతుకుతాం! అందుకే ఆ మార్గం వదిలేసి – ఓ కొంచెం గజిబిజీ రోడ్ పట్టేశాం!? ఎందుకంటే… "కష్టమే కిక్!"